![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -356 లో.. వేదవతి వంటిట్లో బాధపడుతుంది. అప్పుడే అక్కడికి నర్మద వచ్చి.. మిమ్మల్ని వాళ్ళు అలా అనడం తప్పే అయితే.. ప్రేమ అలా వాళ్ళకి సపోర్ట్ చేసిందని.. తను లేచిపోయి వచ్చిందని అనడం కూడా మీరు చేసిన తప్పే.. తన అన్న చెప్పిన మాటలు నమ్మి ప్రేమ మోసపోయిందని నేను నిరూపిస్తానని నర్మద చెప్పి బయటకు వస్తుంది.
అక్కడ బయట ప్రేమ ఉంటుంది. తను చెప్పిన మాటలన్నీ విని ఎమోషనల్ అవుతుంది ప్రేమ. ఇక అమూల్య ఎందుకు అలా చెప్పిందో తనతో నిజం చెప్పించాలని ప్రేమతో నర్మద అంటుంది.
ఇక నర్మద ఇంటిబయట వైపుకి వెళ్తుంది. అక్కడ బట్టలు ఆరేస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. ఇక తన దగ్గరకి వెళ్ళి.. అక్క అని నర్మద పిలుస్తుంది. దాంతో వల్లి షాక్ అవుతుంది. నన్నేనా అని ఆశ్చర్యపోతుంది. ఇక వెంటనే తన ప్లాన్ అమలు చేస్తుంది నర్మద. అక్క నీకు ఉన్నన్ని తెలివితేటలు ఎవరికి లేవు. నువ్వు నాకు సాయం చేయాలని నర్మద అంటుంది. ఏంటని అడుగుతుంది శ్రీవల్లి. మా ఫ్రెండ్ ఒక అతడిని ప్రేమించిందని.. తనే మొదటగా ప్రేమించిందా, వాడు తనని ట్రాప్ చేశాడా ఎలా తెలుసుకోవాలని శ్రీవల్లిని నర్మద అడుగుతుంది. ముల్లుని ముల్లుతోనే తీయాలి. ప్రేమని ప్రేమతోనే బయటకు తీసుకురావాలని శ్రీవల్లి ఓ ఐడియా చెప్తుంది. ఇక ఆ ప్లాన్ కి శ్రీవల్లికి థాంక్స్ చెప్పి వెళ్లిపోతుంది నర్మద.
అమూల్య దగ్గరికి వెళ్లిన నర్మద తనకి సపోర్ట్ చేస్తున్నట్లుగా మాట్లాడుతుంది. విశ్వని నువ్వు మొదటగా ప్రేమించావా.. విశ్వ నిన్ను ప్రేమించాడా అని అమూల్యని నర్మద అడుగుతుంది. తనే నా వెంట పడ్డాడు. గిఫ్ట్ లు ఇచ్చాడని అమూల్య చెప్తుంది. అమూల్య మాటలన్నీ వెనకాల నుండి ప్రేమ వింటుంది. ఇక ప్రేమ తన తప్పు తెలుసుకొని బయటకు వచ్చి కుమలి కుమిలి ఏడుస్తుంది.
మరోవైపు శ్రీవల్లి వాళ్ళ అమ్మ భాగ్యంకి ఫోన్ చేస్తుంది. అమ్మా నేను ఓ గొప్ప పని చేశాను.. నన్ను పొగుడు అని శ్రీవల్లి అంటుంది. ముందు విషయం చెప్పమని భాగ్యం అనగానే నర్మద మాట్లాడిన మాటలన్నీ చెప్తుంది. అది విన్న భాగ్యం.. ఓసి పిచ్చి మొద్దు. నిన్ను పొగిడినట్టుగా పొగిడి అమూల్య నుండి నిజం రాబట్టడానికి నీ దగ్గర ఐడియా తీసుకుందని శ్రీవల్లితో భాగ్యం అంటుంది. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |